- టన్ను కు రూ.595 లు పెరుగుదల
నవతెలంగాణ-అశ్వారావుపేట
పామాయిల్ గెలలు ధర డిసెంబర్ నెలకు గాను స్వల్పంగా పెరిగింది. టన్నుల గెలలు ధర నవంబర్లో రూ.13,146 ఉండగా డిసెంబర్ నెలకు రూ.595 పెరిగి రూ. 13,741కు చేరింది. ఓఈఆర్ శాతం పెరగటంతో గెలలు ధర కూడా పెరిగినట్లు అయిల్ఫెడ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆయిల్ ఇయర్ ఫార్ములాను గత నెలలలో సంస్థ ప్రకటించింది. గత ఏడాది 19.22 శాతం ఉన్న ఫార్ములాను 19.32 శాతం బోర్డు ఆమోదించింది. దీనితో గెలలు ధర కూడా పెరిగింది. ఈ మేరకు అయిల్ఫెడ్ ఉన్నతాధికారులు గురువారం సమావేశమై నూతన ధరను ప్రకటించారు. పెరిగిన ధర డిసెంబర్ నెలకు అమల్లో ఉంటుందని ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామక్రిష్ణారెడ్డి తెలిపారు. మరింత ఓఈఆర్ సాధించేందుకు నాణ్యమైన గెలలు ను మాత్రమే ఫ్యాక్టరీకి తరలించాలని ఆయన రైతులను కోరారు. వచ్చే ఏడాది ఓ ఈఆర్ఆర్ ను 19.50 శాతం సాధించే విధంగా నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Dec,2022 08:32PM