- ఎస్.హెచ్.ఒ రాజేష్ కుమార్
నవతెలంగాణ-అశ్వారావుపేట
మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రాణాలకే హాని అని, ఒక వేళ పోలీసులకు దొరికితే కఠిన చర్యలు తప్పవని ఎస్.ఎచ్.ఒ ఎస్ఐ రాజేష్ అన్నారు. గురువారం మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తులకు, తాగి వాహనాలు నడిపితే కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడిపి ఇతరుల మరణాలకు కారణం కావద్దని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు, పెండింగ్ చలానా, హెల్మెట్ ధారణ, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. పోలీసులు చేసే వాహన తనిఖీలు కేవలం ప్రజల ప్రాణ రక్షణ కోసమేనని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని చెప్పారు. యువత మద్యం తాగి వాహనాలు తల్లిదండ్రులు కన్న కలలు కల్లలు వృథా చేయవద్దని కోరారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 01 Dec,2022 08:45PM