నవతెలంగాణ-కంటేశ్వర్
నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు నిజామాబాద్ నగరంలో ఎన్టీఆర్ ధర్నా చౌక్ వద్ద సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను శుక్రవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శీ నూర్జహాన్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి శివకుమార్ ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు వరదయ్య, ఐఎఫ్టియు జిల్లా నాయకులు విట్టల్ మాట్లాడుతూ మోడీ ఎన్నికల వాగ్దానాన్ని విస్మరించి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్పోరేట్ కంపెనీల ప్రయోజనాలను మోడీ అమిత్ షా ప్రభుత్వాలు కాపాడుతున్నాయని అన్నారు.
12 గంటల పని విధానం తెచ్చే కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. మోడీ ఫాసిస్టు విధానాలు దేశానికి ప్రమాదకరమని ఆయన అన్నారు. కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలని అన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్, జిల్లా నాయకులు శ్రీనివాస్ రాజ్, కృష్ణ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు మోహన్, జెల్లా మురళి, సీటు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 02:46PM