- అసమానతలు లేని విద్యా విధానాన్ని రూపొదించాలి
- ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటి కొండ రవి డిమాండ్
నవతెలంగాణ-కంటేశ్వర్
నూతన జాతీయ విద్యా విధానం రద్దు కొరకు విద్యార్థులంతా ఉద్యమించాలని అసమానతలు లేని విద్యా విధానాన్ని రూపొందించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాకతీయ గోదావరి క్యాంపస్ లో రీజనల్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కి ముఖ్య వక్తగా ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాటికొండ రవి మాట్లాడుతూ.. ఎస్ ఎఫ్ ఐ 17 వ అఖిలభారత మహాసభలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి సారిగా ఈ నెల డిసెంబర్ 13-16 వరకు పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో జరుగుతున్నాయి అని అన్నారు.
నూతన జాతీయ విద్యా విధానం - విద్యార్థులకు అవగాహన అనే అంశం పై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానం పై మేధావులతో చర్చించకుండా లోక్ సభ లో మూజువాణి ఓటుతో ఆమోదం తెలపడం రాజ్యంగ మౌలిక సూత్రాలను దెబ్బ తీయడం అని అన్నారు. అదే విధంగా ఉమ్మడి జాబితాలోనీ విద్యనూ కేంద్ర జాబిత లోనికి మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నూతన జాతీయ విద్యా విధానం రాచపుండు లాంటిదని పేరు గొప్ప-ఊరు దిబ్బ అన్నట్టుగా ఆయన అన్నారు. 5+3+3+4 అనే విద్య విధానం అంకెల గారడీ కి పరిమితం అని విద్యార్థుల సృజాత్మకతకు గీటు రాయి కాదని అన్నారు. అదే విధంగా కాషాయకారణనూ పెంచి పోషించే ఈ జాతీయ విద్యా విధానాన్ని తిప్పి కొట్టాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. 4 సంవత్సరాల డిగ్రీ విద్యా విధానంతో విద్యార్థులు నిరుద్యోగులు మరింత నిరుద్యోగులుగా మారే అవకాశం వుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేయకుండా విదేశీ యూనివర్సిటీలనూ ఎర్ర తివాచిలు పరిచి ఆహ్వానించడం ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
అభివృద్ధి, అసమానతలు లేని విద్యా విధానాన్ని ప్రభుత్వ పాలకులు రూపొందించేంతవరకు పోరాటాలు చేయాలని అన్నారు. నూతన విద్యా విధానం రద్దు చేసేంతవరకు దేశ వ్యాప్తంగా ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాచకొండ విఘ్నేష్, బొడ అనిల్ నగర కార్యదర్శి మహేష్, జిల్లా కో - కన్వీనర్ దీపిక యూనివర్సిటీ ఉపాధ్యక్షులు నవీన్, నాయకులు గణేష్, అన్వేష్, శైలజ, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 03:34PM