నవతెలంగాణ-కంటేశ్వర్
జిల్లాస్థాయి ఎఫ్బి ఎల్ ఎన్ సమీక్ష సమావేశం నగరంలోని ఎస్ఎఫ్ఐ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరగగా ఈ సమావేశంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ నర్ర రామారావు 29 మండలాల నోడల్ ఆఫీసర్స్ 12 మంది మండల విద్యాశాఖల అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం అమలుదారులపై మండలాల వారీగా రివ్యూ చేయడం జరిగింది. ఉపాధ్యాయుల ఎఫ్ఎల్ఎం ద్వారా చాలా మార్పు వచ్చిందని బోధన అభ్యసన కృతముల ద్వారా బోధించడానికి 90 శాతం ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని చాలా కొద్ది మంది మాత్రమే ఈ కార్యక్రమము అమలుకు ప్రముఖంగా ఉన్నారని తెలియజేశారు.
టి ఎల్ ఎం అంటే ప్రదర్శన కోసం కాదని పాఠ్యాంశా బోధన అవసరమయ్యే సామాగ్రి ప్రత్యేకత లభించే వాటిని గృహాలలో వాడే వాటిని ఉపయోగించుకొని ఆ పాఠ్యాంశమును చక్కగా అవగాహన చేయించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గ ప్రసాద్ అన్నారు. తెలుగు గణితము ఆంగ్లం చెప్పినప్పుడు పీరియడ్ ప్లాన్ లో ఉన్న సోఫానాలు మాదిరిగా అమలు చేస్తే విద్యార్థులు అన్ని సామర్థ్యాలు నేర్చుకుంటారని నర్ర రామారావు క్వాలిటీ కోఆర్డినేటర్ తెలిపారు. ఉపాధ్యాయులందరూ ఈ విధంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 03:36PM