- జెండా ఊపి ప్రారంభించిన ధన్పాల్ సూర్యనారాయణ గుప్త
నవతెలంగాణ-కంటేశ్వర్
స్థానిక నగరంలోని గాంధీచౌక్ నుండి దివ్యాంగుల అవగాహన నడక ప్రారంభమయ్యి 200 మంది దివ్యాంగులతో నడక కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శుక్రవారం ధనపాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై జెండా ఊపి నడకను ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ గొప్ప మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగ బాలులతో బలలతో స్నేహ సొసైటీ అవగాహన నడకను ఏర్పాటు చేసిందని ఈ అవగాహన నడకలో పాల్గొంటున్న దివ్యాంగ విద్యార్థుల అందరికి శుభాకాంక్షలు తెలియ చేస్తూ దివ్యాంగులు, కాదు వారికి సహాకారం అందించినట్లైతే సానుభుతి వారు జీవితంలో ఏ స్థాయికి అయినా ఎదుగుతారని కావున సమాజంలో ప్రతి ఒక్కరు వికలాంగుల పట్ల చిన్న చూపుచూడకుండా వారికున్న సామర్ధ్యాలను ప్రోత్సహించాలని కోరారు.
నిజామాబాద్ జిల్లాలో సమర్థవంతముగా దివ్యాంగులకు సేవలు అందిస్తున్న స్నేహ సొసైటికి సహకారాలు అందించడానికి తాను ఎల్లప్పుడు ముందుంటా అని తెలియజేశారు.ఈ అవగాహన నడక గాంధీ చౌక్ నుండి బస్టాండ్ ద్వారా జిల్లా కలెక్టర్ మైదానానికి చేరుకుంది. ఈ ముగింపు కార్యక్రమంనికి జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి గౌరవ అతిధిగా పాల్గోని ప్రసంగించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతు.. దివ్యాంగులు ర్యాలి నిర్వహించి సమాజంతో దివ్యాంగుల పట్ల అవగాహన కల్పించారని దివ్యాంగులు సకలాంగులకు ఏ మంత్రం తీసిపోకుండా ఈ అవగాహన నడకలో పాల్గోని మంచి నినాదాలు చేస్తూ అవగాహన నడకను విజయవంతం చేవారని, రేపు అనగా శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ప్రభుత్వం తరపున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ దివ్యాంగుల అవగాహన నడకకు ముందు జాతిపిత గాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి రాలేని ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమములో బ్రహ్మకుమారి సునిత, బ్రహ్మకుమాంకి - శ్రీనాధి స్నేహ సొసైటీ కార్యదర్శి యస్ సిద్ధయ్య, ప్రినిపాల్యస్ జ్వోతి, -వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి మానసిక వికలాంగ విద్యార్థులు, అంధవిద్యార్థులు, పాఠశాలల సిబ్బంది పాల్గోన్నారు. ఈ కార్యక్రమునికి పోలీస్ డిపార్టమెంట్ తరపున పూర్తి సహకారాన్ని ర్యాలీ పొడవున బందోబస్తును ఏర్పాటు చేసి దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ర్యాలి పూర్తి కావడానికి సహకరించారు. ఈ దివ్యాంగుల అవగాహన నడవ జిల్లుతో మొదటిసారిగా స్నేహ -సొసైటీ ఫర్ రూరల్ రీకన్ స్ట్రక్షన్ నిర్వహించడం జరిగింది. అంధవిద్యార్థులు ర, వికలాంగ విద్యార్థులందరూ కూడా అవగాహన నడకలో పాల్గొని విజయవంతం చేశారు. అలాగే నేడు నిర్వహించబోయే కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కలిసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 03:58PM