నవతెలంగాణ-కంటేశ్వర్
ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు నగరంలోని ఎన్,టి,ఆర్ చౌరస్తా వద్ద రోడ్డుపై అచేతనంగా రోడ్డు పై నిస్సహాయ స్థితిలో ఉన్న ఆనాధ వృద్దున్ని గుర్తించిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులు 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించడం జరిగిందని సంస్థ అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు తెలిపారు. మల ముత్రాలమద్య కదలలేని స్థితిలో ఉన్న ఆ వృద్దిని చూసి అక్కడి స్థానికులు అయ్యెపాపం అంటున్నారే తప్ప అతని దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేకపోతున్నారు.
ఒంటినిండా మలంతో దుర్గందపు వాసన ఆ పరిస్థితుల్లో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులు మానవత్వంతో శుభ్రపరచాటాన్ని చూసి అక్కడి స్థానికులు ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధుల సేవను అభినందించారు. ఈ కార్యక్రమంలో 1వ టౌన్ పోలిస్ సిబ్బంది సంస్థ ఈ.సి మెంబర్ కాసుల సాయి తేజ, కార్యదర్శి సుభాష్, ఉపాద్యాక్షులు పసునూరి వినయ్ కుమార్, ముస్కు రామేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.