నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిదిలోని వీరాపూర్, బేగంపేట, వడ్లూర్, గూడెం, కల్లేపల్లి, గుండారం, తోటపల్లి గ్రామాల్లోని లబ్దిదారులకు శుక్రవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన కూతురు సుదర్శన్ రెడ్డి ఇటీవల ఆనారోగ్య కారణాలతో మృతి చెందగా మృతుని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండల, అయా గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm