- సర్పంచ్,కేంద్రం నిర్వహాకులకు అధికారుల ప్రశంసలు
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిదిలోని చీలాపూర్ గ్రామంలో పీఏసీఎస్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన వరిదాన్యం కొనుగోలు కేంద్రం నిర్దేశించిన వరిదాన్యం కోనుగోలు చేసి దిగ్విజయంగా పూర్తి చేసి శుక్రవారం ముగించారు. ముగించిన కొనుగోలు కేంద్రాన్ని తహసిల్దార్ విజయ ప్రకాశ్ రావు, ఎపీఓ నర్సయ్య సందర్శించారు. గ్రామంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం ద్వారా నిర్దేశించిన 8 వేల క్వింటాళ్ల వరిదాన్యం కొనుగోలు చేసి ముగించడం శుభపరిణామమని సర్పంచ్ రాగుల మొండయ్య,కొనుగోలు కేంద్రం నిర్వహాకులను అధికారులు ప్రశంసిచారు.
Mon Jan 19, 2015 06:51 pm