నవతెలంగాణ-కంటేశ్వర్
మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నిజామాబాద్ జిల్లా మూడవ మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని మధ్యాహ్న భోజన పథకం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నిజామాబాద్ జిల్లా 3వ మహా సభలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
జిల్లా కమిటీ 26 మంది, జిల్లా ఆఫీస్ బేరర్ 18 కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కమిటీ అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, ఉపాధ్యక్షులు, జక్కం సుజాత, బైరి సాయమ్మ, నాగలక్ష్మి,ప్రధాన కార్యదర్శిగా తోపునూరు చక్రపాణి, కార్యదర్శులు బి గంగాధర్ నిరంజన, కోశాధికారి సురేందర్ రెడ్డి, మిగతా 18 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడినారు రాబోయే కాలంలో ఆందోళన ఉదృతం చేస్తూ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా జిల్లా కమిటీగా తీర్మానించుకోవడం జరిగింది. ముఖ్యంగా కోడిగుడ్లు ప్రభుత్వమే సప్లై చేయాలి వంట పాత్రలు ఇవ్వాలి అదేవిధంగా కార్మికులకు ప్రోసిడింగ్ ఆర్డర్లు ఇవ్వాలి ప్రతి నెల పదిలోపట బిల్లులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి మా సాయి శక్తుల కృషిచేసి సంఘాన్ని బలోపేతం చేస్తామని తెలపడం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 04:54PM