నవతెలంగాణ-డిచ్ పల్లి
డిసెంబర్ 10న జరిగే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ 50 వ స్వర్ణోత్సవ సభ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సందర్భంగా జిల్లా నాయకులు కిషన్ మాట్లాడుతూ, యూనియన్ 1972 డిసెంబర్ 10న ఏర్పడిందని, యూనియన్ ఏర్పడినాటికి బీడి పరిశ్రమలు పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. బీడీలు చుట్టే కార్మికులకు ముడి సరుకు ఇచ్చే దానిలో బీడీ యజమాన్యం దోపిడీ తీవ్రంగా ఉండేదని, బీడీలు చుట్టే మహిళా కార్మికులు నిరక్షరాస్యతను, అమాయకత్వని, అనైక్యతను, ఆసరా చేసుకొని విపరీతంగా దోపిడీ చేసే వారన్నారు.
కార్మికులకు నాసిరకమైన తునికాకు ఇచ్చి గుల్లకట్ట తీసుకొని దారం తక్కువ ఇచ్చి రోజువారి బీడీలు రాసేవారని, వీటన్నిటిని గమనించిన ఆనాటి, ప్యాకింగ్ చేసే కార్మికుల 30 మంది కార్మికులతో ఏర్పడిన యూనియన్ నేడు లక్షలాది కార్మికులతో ముందంజలో ఉండి కార్మికుల సమస్యల మీద నిరంతరం పోరాడుతూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండి పనిచేస్తున్న ఏకైక యూనియన్ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మురళి, ఇంతియాజ్ ,ధరంపురి, నరహరి, జాకీర్, రమేష్, మల్లేష్, ప్రవీణ్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 04:56PM