- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ
నవతెలంగాణ-కంటేశ్వర్
బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా జన్మదిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రి రైల్వే స్టేషన్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో బిజెపి జాతీయ పార్టీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా జన్మదినం సందర్భంగా అర్బన్ నియోజకవర్గం నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిరుపేదలకు యాచకులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుందని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నత స్థాయిలో ఉండాలని వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వారు వివరించడం జరిగింది. పార్టీ ఈ స్థాయిలో ఉందంటే దాంట్లో జెపి నాడ్డ కృషి ఎంతో ఉందన్నారు సామాన్య కార్యకర్తగా పార్టీ లో అందరికి అందుబాటులో ఉంటూ ఈ రోజు జాతీయ అధ్యక్షులుగా వారు కొనసాగడం చాలా గొప్ప విషం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీ నారాయణ, అసెంబ్లీ కన్వీనర్ పంచరెడ్డి లింగం, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, రోషణ్ లాల్ బోర, పుట్ట వీరేందర్, గట్ల గంగాధర్, అమందు విజయ్, శివునూరి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 05:00PM