నవతెలంగాణ-దుబ్బాక రూరల్
బిజెపి దళిత మోర్చా సిద్దిపేట జిల్లా కార్యదర్శిగా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గుర్రాల సబ్బు (సినీ నటుడు) శుక్రవారం నియామకమయ్యారు. ఈ మేరకు దుబ్బాక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట జిల్లా బిజెపి ఇంచార్జీ అంజన్ కుమార్ గౌడ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా గుర్రాల సుబ్బు సినీ నటుడు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి కేటాయించడం చాలా సంతోషకరమని అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో మరింత క్రియాశీలకంగా పని చేస్తానని తెలిపారు.
ప్రధాని మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఇంటా తెలియజేసి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో దుబ్బాక గడ్డపై బీజేపీ జెండా ఎగరడమే లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు. బిజెపి జిల్లా కార్యదర్శిగా తన నియమకానికి కృషి చేసిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, దళిత మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మంకిడి స్వామికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 05:06PM