నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని మోగా గ్రామంలోని ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ హాల్ వద్ద శుక్రవారం నాడు ఆ గ్రామ సర్పంచ్ సూర్యకాంత్ పటేల్ భూమి పూజ చేస్తూ బోరు వేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతుందని ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ హాల్ వద్ద బోరు వేయించడం జరిగిందని ఆయన తెలిపారు. సంఘం కమ్యూనిటీ హాల్ వద్ద బోరు వేయించినందుకు సర్పంచ్ కు ముదిరాజ్ సంఘం సభ్యులు అందరూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగనాథ్ గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm