నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మీబాయి శంకర్ పటేల్ అయ్యప్ప గురు స్వామి సగృహంలో శుక్రవారం నాడు అయ్యప్ప స్వాములు బిక్ష నిర్వహించారు. ఈ బిక్షకు దాదాపు 200 మంది స్వాములు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ బిచ్కుంద జుక్కల్ మూడు మండలాల నుండి స్వాములు దీక్షకు హాజరై పాల్గొన్నారు సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మాజీ చైర్మన్ పండిత్ రావు పటేల్ పలువురు గ్రామ పెద్దలు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm