నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని డోంగ్లి నూతన మండలంగా ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి రాక కోసం ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని శుక్రవారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే, బాన్సువాడ ఆర్డీవో రాజా గౌడ్ తాసిల్దార్ అనిల్ కుమార్, ఇతర శాఖల అధికారులు పోలీస్ అధికారులు పరిశీలన జరిపారు. ఏర్పాట్ల గురించి జుక్కల్ ఎమ్మెల్యే అనుమాంతసిందే అధికారులకు అడిగి తెలుసుకోవడంతో పాటు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే పరిశీలన కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ రామ్ పటేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్ పటేల్ స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ, మండలంలోని వివిధ గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm