- బిచ్కుంద ఏ డి ఏ నూతన్ కుమార్
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో కంది, శనగ, పొద్దు తిరుగుడు పంటలను బిచ్కుంద ఏడిఏ నూతన్ కుమార్, మండల వ్యవసాయ అధికారి రాజు ఏ ఈ ఓ లక్ష్మణ్ కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ బిచ్కుంద ఏ డి ఏ నూతన్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా రైతులు ఆన్లైన్లో పిఎం కిసాన్ పథకంలో ఈ కేవైసీ తప్పకుండా చేసుకోవాలని రైతులకు సూచించారు.
అలాగే మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ రైతులు ఒకే పంట కాకుండా పప్పు దినుసుల పంటలను అధిక మొత్తంలో సాగు చేయాలని తెలియజేశారు. యాసంగి లో సాగు చేస్తున్నా పంటలను సర్వే నంబర్ వారీగా యే ఏఈఓ దగ్గర నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, మద్నూర్ సొసైటి చైర్మన్ శ్రీనివాస్ పటేల్, మాజీ సొసైటి చైర్మన్ పండిత్ రావు, ఏ ఈ ఓ లక్ష్మణ్, సొసైటి డైరెక్టర్ సుధాకర్ రైతులు నాగ్నాథ్ తదితరులు పాల్గొన్నారు .
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 05:54PM