నవతెలంగాణ-రాజంపేట్
నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని భారతీయ జనత యువ మోర్చా రాజంపేట మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ జానకికి వినతి పత్రం అందజేయడం జరిగిందని రాజంపేట మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని నోటిఫికేషన్లు విడుదల చేసిన ఉద్యోగాల నియామక పక్రియ త్వరగా చేపట్టాలని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖల నోటిఫికేషన్లు జారీ చేసి జాప్యం చేయకుండా వాటి నియామకాలను వెంటనే జరపాలన్నారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించని పక్షాన బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పిట్ల నవీన్, ఉపాధ్యక్షుడు పోలీస్ ప్రసాద్, బిజెపి అధ్యక్షుడు గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీను, రాజంపేట టౌన్ అధ్యక్షుడు గుర్రాల రాము, దుర్గాప్రసాద్, ప్రశాంత్, సంతోష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 05:56PM