- విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు వెంకటరమణ
- విషయం తెలిసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ది
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా జిల్లా కేంద్రంలోని మోడ్రన్ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఉపాధ్యాయుడు వెంకటరమణను విద్యార్థుల తల్లి దండ్రులు విషయం తెలుసుకొని శుక్రవారం చితక బాదారు. మోడ్రన్ పబ్లిక్ పాఠశాలలో బయోలాజికల్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న వెంకట రమణ విద్యార్థి నీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, తల్లిదండ్రులకు విద్యార్థినిలు చెప్పడంతో పాఠశాలకు చేరుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు ఆవేశంతో చెప్పులతో కొడుతూ ఉపాధ్యాయుడిపై భడిత పూజ చేశారు.
తన పిల్లలపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఉపాధ్యాయుడు పై తల్లిదండ్రులు విడిచిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఉపాధ్యాయుడిపై చెప్పులతో కొడుతూ ఊరికించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పాఠశాల ప్రిన్సిపాల్ పై ప్రభుత్వం పై ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల పట్ల ఇలా చేయడం సరైన పద్ధతి అంటూ నిలదీశారు. నీకు ఆడపిల్లలు లేరా అంటూ ఉపాధ్యాయుడు వెంకటరమణ ప్రశ్నిస్తూ తల్లిదండ్రులందరూ కలిసి ఉపాధ్యాయుడికి దేహ శుద్ధి చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు వెంకటరమణను అప్పగించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 06:09PM