నవతెలంగాణ-రాజంపేట్
మండలంలోని ఆరేపల్లి గ్రామంలోని ఎస్సీ కమిటీ హాల్ సమీపంలో సింగిల్ ఫేస్ మోటర్ ను శుక్రవారం ప్రారంభించినట్టు మాల కుల సంఘ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సహకారంతో బోరు మోటర్లు ప్రారంభించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి యాదగిరి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బిక్కజి బాల్వంత్ రావు, సీనియర్ నాయకులు మాలిష్ కమలాకర్ రావు, సంఘ సభ్యులు మాణిక్యం, సంతోష్, కొమ్ము రమేష్, అంబేద్కర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm