- పంట సాగుకు కోతుల బెడద ఉండదు
నవతెలంగాణ-డిచ్ పల్లి
ఆయిల్ ఫామ్ సాగు చేస్తే ప్రభుత్వం ఆసాగు పై సబ్సిడీ అందజేస్తుందని, కూలి ఖర్చు తక్కువ అవుతుందని ఒక్క రైతు మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చని, దీంతోపాటు పంట సాగుకు కోతుల బెడద అసలుకే ఉండదని ఆయిల్ ఫామ్ సాగుకే రైతులు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు అన్నారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఫైండ్ ఫామ్ సాగు యొక్క ప్రాధాన్యత సాగు చేయడం వల్ల కలిగే లాభాలపై మండల స్థాయి అధికారులకు ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు ఎంపీడీవో గోపి బాబు పాల్గొని మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట సాగు విదానం, సబ్సిడి వివరాలపై రైతులకు అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం-వ్యవసాయ శాఖ నిజామాబాద్ జిల్లా అధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు చేయడానికి ఆసక్తి ఉన్న రైతులు క్రింద తెలిపిన డాక్యుమెంట్లు జిరాక్స్ కాపీలను, డిడి ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆధార్ కార్డు జీరాక్స్,బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ లేదా 1-బి కాపీ జిరాక్స్, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు రేండు అందజేయాలని సూచించారు.
డిడి తీయవలసిన చిరునామా
District Horticulture and Sericulture officer Nizamabad.
ఆయిల్ పామ్ సాగు కు అందించు రాయితిలు ఒక మొక్క ఖరీదు193 రూపాయలు దానిలో రైతు చెల్లించవలసినది 20 రూపాయలు మాత్రమేనని, మిగిలిన డబ్బులు ప్రభుత్వం రాయితి అందిస్తుందన్నారు. ఎకరానికి 50 మొక్కలు ఉండాలని, రైతు వాటా 20 × 50 = 1000 ఎకరానికి 1000 రూపాయలు ఉంటుందని వివరించారు. 4 ఏళ్ళ వరకు ఆయిల్ పామ్ సాగు, అంతర పంటల సాగు నిర్వహణ ఖర్చు ఇవ్వబడుతుందని, ఆయిల్ పామ్ సాగుకు రూ. 2వేల100 ఎకరాకు, అంతర పంట సాగుకు రూపాయలు2వేల100 ఎకరాకు, మొత్తం ఎకరానికి 4,వేల200 రూపాయలు ఏడాదికి ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాలో జామ చేస్తుందని తెలిపారు. రెండవ సంవత్సరం పైన తెలిపిన విధంగా ఎకరానికి 4వేల200 ఇస్తుందని,మూడవ సంవత్సరం పైన తెలిపిన విధంగా ఎకరానికి 4వేల200 ఇస్తుందన్నారు. నాల్గవ సంవత్సరం పైన తెలిపిన విధంగా ఎకరానికి 4వేల200 ఇస్తుందని పేర్కొన్నారు.
డ్రిప్ సేద్యం ద్వారా ప్రభుత్వం సబ్సిడీ వస్తుందని కేవలం ఈ పంట సాగుకు ఎస్సీ ఎస్టీలకు 100% బీసీలకు 90% ఓసి హైదెకరాలపై ఉన్న వారికి 90% ఓసి ఎబో ఏరియా ఉన్నవారికి 80% చొప్పున సబ్సిడీ అందజేస్తుందన్నారు. తోట నాటిన 3 ఏళ్ళ తర్వాత దిగుబడి ప్రారంభమై 25 సంవత్సరాల వరకు కొనసాగుతుందని రైతులకు వివరించారు. మొదటి 3ఏళ్ళ వరకు అన్ని రకాల కూరగాయలు, వేరుశనగ, సొయా, పత్తి, పెసర, మినుములు, శనగ, కుసుమ, పసుపు, జొన్నలు, మక్కలు, సజ్జ, ఎర్ర జొన్నలు, మెట్ట పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చని పేర్కొన్నారు. వరి, చెరుకు పంటను అంతర పంటలుగా సాగు చేయరాదని సూచించారు. నాల్గు ఏళ్ల తర్వాత కూడా దుక్కి దున్నకుండా అంతర పంటలుగా కోకో, మిరియాలు, జనిజాపత్రి సాగు చేయవచ్చని పేర్కొన్నారు.
అలాగే దేశీ కోళ్లు, పాడి పరిశ్రమ, మేకల పెంపకం చేయవచ్చని చెప్పారు.పది నుండి పదిహేను వేల పెట్టుబడితో ఒక ఎకరానికి 10 టన్నుల దిగుబడి, ఒక 1 లక్ష రూపాయల ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. మొక్కల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు పైన తెలిపిన జిరాక్స్ పత్రాలు డిడి లను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ఎఈఓ లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల రైతుబంధు సమితి అధ్యక్షులు జీనియస్ నారాయణరెడ్డి వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారులు నృపేష్ కుమార్, వంశీకృష్ణ, ఆశ్రితరాజ్, భావన, గ్రామ రైతుబంధు సమితి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 06:30PM