నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందినా విషయం తెలుసుకొని శుక్రవారం టీపిసిసి రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిప్పాపూర్ పట్వారిగా పనిచేసిన దేవేందర్ రెడ్డి మృతి చెందడం బాధాకరమని, పట్వారిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm