నవతెలంగాణ-భిక్కనూర్
సహకార బ్యాంకు డిపాజిట్లపై బ్యాంకు అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గల సహకార బ్యాంకు మేనేజర్ శాంతాదేవి పట్టణంలో పలు వ్యాపారులతో పాటు ప్రజల వద్దకు వెళ్లి నూతనంగా ప్రవేశపెట్టిన సహకార బ్యాంకు డిపాజిట్లపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సహస్ర డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లించడం జరుగుతుందని, పథకంలో వెయ్యి రోజులు డిపాజిట్ చేస్తే7.75 శాతం వడ్డీ చెల్లించడం జరుగుతుందని తెలిపారు. సహకార బ్యాంకుల ద్వారా గృహ నిర్మాణదారులకు, విద్యార్థులకు, వ్యాపారులకు డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇవ్వడం జరుగుతుందని, పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మిగతా బ్యాంకుల కంటే ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సరోజ, బ్యాంకు సిబ్బంది సుమ, సింధుజ పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 06:33PM