నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం జడ్పి సీఈఓ గోవింద్ ఆకస్మికంగా సందర్శించారు. గ్రామపంచాయితీలో నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేశారు. హరితహారం పనులను పరిశీలించి, ఓటర్ నమోదు కార్యక్రమాన్ని గురించి పంచాయితీ కార్యదర్శిని అడిగితెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయితీ భవనాన్ని పరిశీలించి పనుల పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ఇందులో భాగంగా సర్పంచ్ గుల్లే లావణ్య గంగాధర్,ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్, ఎమ్మార్వో జనార్దన్, పంచాయతీ కార్యదర్శి జాకీర్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm