నవతెలంగాణ-భిక్కనూర్
క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఒకేషనల్ ఎలక్ట్రికల్ విద్యార్థులు పలు ఎలక్ట్రికల్ వైన్డింగ్ షాపుల్లో శిక్షణ పొందుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ఎలక్ట్రికల్ కోర్స్ చదువుతున్న విద్యార్థులు శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా భిక్కనూర్ మండల కేంద్రంలో గల పలు మోటార్ వైన్డింగ్ షాపులతోపాటు వెల్డింగ్ షాపులలో వారు శిక్షణా పొందారు. కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థులు మండల కేంద్రంలో 45 రోజులపాటు శిక్షణ పొందుతారని కోర్సు లెక్చరర్లు బాల ప్రకాష్ శ్రీనివాస్ తెలిపారు. ప్రాక్టికల్ గా శిక్షణ పొందడం వల్ల విద్యార్థులకు ఎంతగానో సబ్జెక్టుపై పూర్తి అవగాహన వస్తుందని, ఒకేషనల్ కోర్సు చదివితే స్వయం ఉపాధితో పాటు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm