- బివియం రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్
నవతెలంగాణ-డిచ్ పల్లి
భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని బివియం రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ కోరారు. శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యావర్ధిని తో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ మాట్లాడుతూ భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర మహాసభలు ఈనెల 5వ న మూడవ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్ కేంద్రంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ తదితర మహనీయుల ఆలోచన వేదికగా విద్యార్థి, ప్రజా సమస్యల పైన కేంద్ర , రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేస్తుందన్నారు.
ఈ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు చర్చిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పేర్కొన్నారు. విద్యను ప్రైవేటైజేషన్ ను వ్యతిరేకించాలని, ప్రభుత్వ యూనివర్సిటీ లను కాపాడాలని అన్నారు.పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఇంచార్జ్ అర్బస్ ఖాన్, నాయకులు రమణ, దినేష్, రాజేందర్, ప్రసాద్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 06:49PM