- ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్
- ముదిరాజ్ మహాసభ ములుగు జిల్లా అధ్యక్షునిగా బొల్లు దేవేందర్ ఏకగ్రీవ ఎన్నిక
నవతెలంగాణ-తాడ్వాయి
ముదిరాజ్ లకు సమాజంలో సముచిత స్థానం ఎందుకు ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఉందని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ అన్నారు. శుక్రవారం ముదిరాజ్ మహాసభ ములుగు జిల్లా అధ్యక్షునిగా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన బొల్లు దేవేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియామక పత్రాన్ని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ చేతుల మీదుగా దేవేందర్ కు అందించారు. నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ మహాసభ ములుగు జిల్లా నూతన అధ్యక్షులు దేవేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ లు సామాజికంగా, ఆర్థికంగా ఆశించిన ప్రగతి సాధించలేకపోయామన్నారు.
తీవ్ర అణిచివేతకు గురవుతూ చట్టసభల్లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్నారు. ములుగు జిల్లాలో ముదిరాజ్ మహాసభను గ్రామ గ్రామాన కమిటీలు వేసి నూతన మండల కమిటీలను ఏర్పాటు చేసి తద్వారా ముదిరాజ్ కులస్తుల జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తానని ముదురాజ్ ల సమస్యలపై నిరంతరం పోరాడుతానని, ముదిరాజుల అందరికీ నేను అండగా ఉంటానని చెప్పారు. నాపై నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు అప్పజెప్పినందుకు కృతజ్ఞుడై ఉంటానని, నా మీద నమ్మకం ఉంచి సహకరించిన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ కి ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు అశోక్ ఉమ్మడి జిల్లా మత్య సొసైటీ సహకార సంఘం అధ్యక్షులు బుస్స మల్లేశంకి, ఉమ్మడి భూపాల్ పల్లి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు జోరుక సమన్నకి, ముదిరాజ్ మహాసభ నాయకులు పులి రజనీకర్ ములుగు జిల్లాలో ఉన్న ముదిరాజ్ మాజీ, లేక కొత్త, జెడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచులు మత్స్య సొసైటీ సహకార సంఘాల చైర్మన్ లందరికీ ముదిరాజ్ కులస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 06:52PM