నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల మండలం దోంచంద గ్రామానికి చెందిన సుమారు 30 మంది ఒక శుభకార్యానికి హాజరై, దురదృష్టవశాత్తు అస్వస్థతకు గురికావడంతో ఆర్మూర్ లోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అస్వస్థతకు గురైన 30 మందికి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సిబ్బందిని మంత్రి వేముల కోరారు. ఆయన వెంట తాళ్ళ రాంపూర్ పీఏసీఎస్ చైర్మన్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు నాగిరెడ్డి రాజేంధర్, ఆశిరెడ్డి శ్రీనివాస్, నాగిరెడ్డి రాజశేఖర్ తదితరులు న్నారు.
Mon Jan 19, 2015 06:51 pm