- హుజురాబాద్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి
- వీణవంకకు త్వరలో సీఎం కేసీఆర్ రాక
నవతెలంగాణ-వీణవంక
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఆడబిడ్డకు మేనమామలా సీఎం కేసీఆర్ ఉన్నాడని, పుట్టిన బిడ్డ నుండి పండు ముసలోళ్ల వరకు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందజేసేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా త్వరలో వీణవంకకు సీఎం కేసీఆర్ రానున్నారని ఆయన చెప్పారు. దీంతో నియోజకవర్గంతో పాటు వీణవంక మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ఈటల గెలిచి సంవత్సరమైనా చేసిన అభివృద్ధి ఏంది..? హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచి సంవత్సరమైందని, అప్పటి నుండి ఇప్పటి వరకు తను ఏం చేశాడని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరిచే విధంగా గ్యాస్ ధరలను పెంచి దోచుకుంటుందని, దీనికి ఈటల ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక, తహసీల్దార్ దండిగ రాజయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజరు భాస్కర్ రెడ్డి, నాయకులు మాడ సాధవరెడ్డి, ముసిపట్ల తిరుపతిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 02 Dec,2022 07:30PM