నవతెలంగాణ-వీణవంక
భూలక్ష్మి-మహాలక్ష్మి బొడ్రాయి ఉత్సవాలు నిర్వహించి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మండల కేంద్రంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సహకారంతో గ్రామంలో హైమాస్ లైట్లు ఏర్పాటు చేయడంతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీల కుమారస్వామి, ఉప సర్పంచ్ ఓరెం బానుచందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm