- తాహసిల్దార్ అల్లం రాజకుమార్
నవతెలంగాణ-గోవిందరావుపేట
జనవరి ఒకటో తారీకు 2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని స్థానిక తహసిల్దార్ అల్లం రాజకుమార్ అన్నారు. శనివారం మండలంలోని మచ్చాపురం గోవిందరావుపేట పసర తదితర గ్రామాల్లో బూత్ లెవెల్ అధికారుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ రాజకుమార్ మాట్లాడుతూ బూత్ లెవెల్ అధికారులు తప్పనిసరిగా గ్రామాలలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిని గుర్తించి విధిగా ఓటర్ నమోదు చేయించే విధంగా చూడాలన్నారు. గ్రామాల నుండి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు మరియు చనిపోయిన వారి కి సంబంధించిన పూర్తి వివరాలను కూడా పొందుపరచాలని అన్నారు.
నేడు రేపు కూడా ఈ బూతు లెవల్ అధికారులు పూర్తిస్థాయిలో పనిచేస్తారని సూచించారు. ఆన్లైన్ విధానంలో కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అన్నారు. బూతు లెవెల్ అధికారులు రెవిన్యూ సిబ్బంది సహాయంతో పూర్తిస్థాయిలో పనిచేసి ఓటర్ల జాబితా ఓటరు నమోదు సవరణల విధానాన్ని పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజకుమార్ తో పాటు ఆర్ఐ రాజేందర్ రెవెన్యూ సహాయకులు మరియు బూతులు అధికారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 02:39PM