- ఎంఈఓ గొంది దివాకర్
నవతెలంగాణ-గోవిందరావుపేట
వికలాంగులైన విద్యార్థులకు విద్యాశాఖ భవిత సెంటర్ ద్వారా ప్రత్యేక ఉపాధ్యాయులతో ప్రత్యేక బోధన నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి గొంది దివాకర్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో స్థానిక సర్పంచ్ లావుడియా లక్ష్మి జోగనాయక్ ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఈఓ దివాకర్ మాట్లాడుతూ వికలాంగులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వ విద్యాశాఖ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. విద్యాపరంగా వారికి ఎలాంటి లోటు లేకుండా అనువైన పద్ధతులలో భవిత సెంటర్ ద్వారా ప్రత్యేక బోధనా పద్ధతులతో విద్యను అందిస్తున్నట్లు తెలిపారు.
సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగులైన విద్యార్థులు మానసిక ధైర్యంతో చదివి గొప్ప స్థాయికి ఎదిగి ఇతరులకు మార్గదర్శకం కావాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఐ ఆర్ టి ఈ ఉపాధ్యాయుడు రమేష్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతుల ద్వారా వికలాంగులకు విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు భవిత సెంటర్ వారి భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అనంతరం వికలాంగ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. అదేవిధంగా వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కే రఘురాం ఉపాధ్యాయులు లక్ష్మి, రాజు, కన్నయ్య, సూర్యం, ఎంఆర్ సి విష్ణు, చందు, రజిత, బిక్షపతి ఐ ఆర్ టి ఈ ఉపాధ్యాయుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 02:42PM