- సిపిఎం జిల్లా కమిటీ ఆరోపణ
నవతెలంగాణ-కంటేశ్వర్
ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూల్చడంతో కోట్లాది రూపాయల నష్టం జరుగుతుంది అని సిపిఎం జిల్లా కమిటీ ఆరోపించింది. ఈ మేరకు జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో 10, 15 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు జిల్లా అధికారులు కూల్చివేయడంతో పూర్తిగా ఇది ప్రజాధనం దుర్వినియోగం అవుతుందే తప్ప మరొకటి కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆరోపించారు. జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్మించిన అడిషనల్ కలెక్టర్ కార్యాలయం కానీ, ల్యాండ్ కార్యాలయం, రూరల్ ఎమ్మార్వో కార్యాలయం, ఇరిగేషన్ కార్యాలయం డీఈవో కార్యాలయం మొదలగున్నవి ఒక దశాబ్ద కాలం క్రితం నిర్మించినవి మాత్రమే అని ఇంకా వాటికి కనీసం 40 సంవత్సరాల పైగా వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ అన్నిటిని నగర అభివృద్ధి పేరుతో కూల్చివేయటం పూర్తిగా బాధ్యతారహితమని ఆయన ఆరోపించారు.
కళాభారతి, సమీకృత మార్కెట్ యార్డులు నిర్మాణానికి సరిపడా స్థలం ఉన్నప్పటికీ ప్రభుత్వ స్థలాలను ఉన్నవాటిని వాడుకలో తెచ్చుకొని నిర్మించవచ్చు కానీ ఈ విధమైన దుర్వినియోగం చేయటం సరైంది కాదని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో నిధుల దుర్వినియోగం అవుతుందే తప్ప మరొకటి కాదని అన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖలీల్ బాడీలో నిర్మించిన స్టేడియం కూల్చివేసి హాస్పటల్ నేర్పించారని ఇప్పుడు కార్యాలయానికి సరిపడా స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికీ అక్కడ నిర్మించకుండా ఊరు చివరన కొద్దిమంది నాయకుల ప్రయోజనాల కొరకు నిర్మించి ప్రజలకు అధికారులు అందుబాటులో లేకుండా చేశారని ఇప్పుడు ఈ స్థలాలను కొద్దిమంది అవసరాల కోసం కట్టబెట్టటం కొరకు కూల్చుతున్నారనే అనుమానం ప్రజల్లో కలుగుతుందని ఆయన ఆరోపించారు. రాజకీయ పార్టీల అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి ప్రజలందరికీ జరుగుతున్న విషయాలను వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 02:45PM