నవతెలంగాణ-కంటేశ్వర్
ఎఐసిసి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నగర జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తేదీ 05-12-2022 సోమవారం రోజున ఉదయం 12:00 గంటలకు నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని నగర కాంగ్రెస్ కమిటీ నిజామాబాద్ అధ్యక్షులు కేశవ వేణు శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు, పిసిసి కోశాధికారి సుదర్శన్ రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, మాజీ ప్రభుత్వ విప్ విరవత్రి అనిల్, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, అర్బన్ ఇంచార్జ్ తాహిర్ బీన్ హందాన్, రూరల్ ఇన్చార్జి భూపతి రెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొంటున్నారు అని తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 03:01PM