- గ్రామీణ బ్యాంకు మేనేజర్ సంతోష్
నవతెలంగాణ- డిచ్ పల్లి
గ్రామీణ బ్యాంకు సేవలను పల్లేల్లో విస్తరించామని దీనిని సద్వినియోగం చేసుకోవాలని గన్నరం గ్రామీణ బ్యాంకు మేనేజర్ సంతోష్ అన్నారు.ఇందల్ వాయి మండలంలోని చంద్రయన్ పల్లి గ్రామంలో శనివారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గన్నారం శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ సంతోష్ మాట్లాడుతూ ప్రజలు బ్యాంకు సేవలను ఉపయోగించుకోవాలని పంట రుణాల, అటల్ పెన్షన్ యోజన, ప్రమాద బీమా ఇలాంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని అన్నారు.
సంవత్సరానికి 20 రూపాయలతో రెండు లక్షల ప్రమాద బీమా, సంవత్సరానికి 1000 ఒక వేయ్యి రూపాయలతో 22 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాలు తమ బ్యాంకులో ఉన్నాయని, ప్రతి ఖాతాదారుడు బీమా చేయించుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన వస్తువులు వాహనాలకు భీమా చేస్తున్న ప్రజలు తమకు బీమా చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని బీమా చేయించుకోవడం వల్ల కుటుంబానికి భరోసా ఉంటుందని వివరించారు. సమావేశంలో కళాజాత బృందం వారిచే ప్రదర్శన ద్వారా ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత గంగాదాస్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ నరేష్, వార్డ్ సభ్యులు, బ్యాంకు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 03:07PM