- ఏఐవైఎస్ మండలాద్యక్షుడు దీటీ బాలనర్స్ పిలుపు
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యలయం అవరణం వద్ద డిసెంబర్ 6న నిర్వహించనున్న అంబేడ్కర్ వర్దంతిని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐవైఎస్ మండలాద్యక్షుడు దీటీ బాలనర్స్ పిలుపునిచ్చారు.శనివారం మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యలయ అవరణంలో అంబేడ్కర్ వర్దంతి వేడుకల నిర్వహణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీటీ బాలనర్స్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల స్వార్థకత కోసం పరితపించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ వర్థంతి వేడుకకు మండలంలోని అయా గ్రామాల ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ ప్రజలు పెద్ద ఎత్తున హజరై జయప్రదం చేయాలని కోరారు. జిల్లాద్యక్షుడు బోనగిరి శ్రీనివాస్,జిల్లాధికార ప్రతినిధి చిలుముల దేవదాస్, టీఎవైఎస్ మండలాద్యక్షుడు వడ్లూరీ పర్శరాం, బోనగిరి గంగారాం తదితరులు హజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 03:10PM