- చట్టవిరుద్ధంగా పట్టా చేసుకున్న సర్పంచ్ తీరుపై జయచంద్ మండిపాటు
- తోటపల్లి సర్పంచ్ వ్యవహరంపై చర్యలు చేపట్టాలని బీజేపీ వినతి
నవతెలంగాణ-బెజ్జంకి
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ భూములు పట్టా భూములుగా రూపాంతరం చెందుతూ రాష్ట్రంలోనే అక్రమాలకు నిలయంగా జిల్లాలోని బెజ్జంకి మండలం పేరు ప్రఖ్యాతులు గడిస్తుందని దళిత సామాజిక వర్గాలకు చెందిన ప్రభుత్వ భూములను అగ్రవర్ణాలకు పట్టా భూములుగా మార్చుతున్న తహాసిల్దార్ కార్యలయ అధికారులపై బీజేపీ రాష్ట్ర నాయకులు వోరం జయచంద్ మండిపడ్డారు. మండల పరిదిలోని ముత్తన్నపేట గ్రామ శివారులోని 252/డీ సర్వే నంబర్ యందు 3.35 ఎకరాల ప్రభుత్వ భూముని తోటపల్లి గ్రామ సర్పంచ్ బోయినిపల్లి నర్సింగరావుకు చట్ట విరుద్దంగా పట్టా భూమిగా మార్చుకున్న వ్యవహరంపై బీజేపీ నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు. దళిత సామాజిక వర్గాలకు అందజేసిన ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చుకున్న సర్పంచ్ బోయినిపల్లి నర్సింగరావుపై చట్టపరమైన చర్యలు చేపట్టి పట్టాను రద్దుచేసి అధికారులు స్వాదీనపర్చుకోవాలని తహాసిల్దార్ విజయ ప్రకాశ్ రావుకు బీజేపీ నాయకులు వినతిపత్రమందజేశారు. బీజేపీ నాయకులు దోనే అశోక్, సంఘ రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 03:12PM