- ఏఐవైఎస్ మండలాద్యక్షుడు దీటీ బాలనర్స్ డిమాండ్
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిదిలోని దాచారం గ్రామంలో 124 సర్వే నంబర్ యందు పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు భూములందజేసి సర్వే పూర్తయిన రైతులందరికి ఒకే దఫాలో పరిహారమందజేయాలని శనివారం ఏఐవైఎస్ మండలాద్యక్షుడు దీటీ బాలనర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాధికారులు భూములపై పూర్తిస్థాయిలో సర్వే పూర్తి చేసి పరిహారమందజేయడానికి ప్రణాళికలు సిద్దం చేసిన సంబంధిత అధికారులు విడతల వారిగా పరిహారమందజేసేందుకు ప్రక్రియ కొనసాగించడం సరైందికాదని రైతులందరికి సమన్యాయం జరిగేల ఒకే దఫాలో రైతులకు పూర్తి స్థాయిలో పరిహరమందజేయాలని బాలనర్స్ ప్రభుత్వాన్ని కోరారు.