- వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్
నవతెలంగాణ-నవీపేట్
ఆయిల్ ఫామ్ పంటతో రైతు అధిక లాభాలను పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్ అన్నారు. మండలంలోని నందిగాం గ్రామంలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహనను కలిగించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ అందించాలనుకునే రైతులు ఎకరానికి వేయి రూపాయల డిడి కడితే 50 మొక్కలతో పాటు సబ్సిడీ డ్రిప్ పథకాన్ని ప్రభుత్వమే అందిస్తుందని అన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడితేనే అధిక లాభాలను సంపాదించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోస్లీ లావణ్య కిషన్ రావు, ఎంపీడీవో సాజిద్ అలీ, ఎం పి ఓ రామకృష్ణ, ఉప సర్పంచ్ సాయినాథ్, ఎంపీటీసీ ద్యావాడే లలిత సంజీవ్, ఏఈవోలు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 03:19PM