నవతెలంగాణ-కంటేశ్వర్
డిసెంబర్ 6 7 తేదీలలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, జిల్లా ఉపాధ్యక్షులు పుష్పూరు లింగం, నర్ర శంకరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లో పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ నిరంతరం వ్యవసాయ కూలీల కోసం, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, పేద ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అనేక పోరాటాలు చేసి వ్యవసాయ రంగంలోకి యంత్రాలు రావడం వలన వ్యవసాయ పనులు తగ్గినాయని, 2005లో పోరాడి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సాధించుకుంది.
అనంతర ప్రభుత్వాలు అనేక సందర్భాలలో దాన్ని రద్దు చేసే కుట్రలు చేస్తుంటే వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత స్థాయి వరకు పోరాటాలు చేసి కాపాడుకుంటూ వస్తున్నది. కూలి రేట్లు కూడా కూలీలకు నిత్యవసర సరుకులు కనుగుణంగా పెంచాలని పోరాటాలు చేసి సాధించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేకత కలిగిన సంఘం 3వ జిల్లా మహాసభలు బోధన్ మండలం ఎరాజ్ పల్లిలో ఈనెల 6 - 7 తేదీలలో జరుపుకుంటున్నాం. ఈ మహాసభలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ గారు మరియు సోదర సంఘాల నాయకత్వం హాజరవుతున్నారు. ఈ మహాసభల జయప్రదానికి వ్యవసాయ కూలీలు, వన సేవకులు, ఉపాధి కూలీల సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి సామాన్య ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 03:22PM