- పి ఆర్ టి యు స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ పాయం మానేశ్వర్రావు
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని కాటాపూర్ లో శనివారం ప్రైమరీ పాఠశాల హెచ్ఎం, పి ఆర్ టి యు స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ పాయం మానేశ్వర్రావు నిరుద్యోగ యువతకు విద్య, ఉద్యోగాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత సమయాన్ని వృధా చేయరాదని తెలిపారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అనివార్య కారణాల వలన విద్యను మానేసిన విద్యార్థులు దూర విద్యా ద్వారా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కాటాపూర్ లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నైట్ వాచ్మెన్, అటెండర్, లైబ్రేరియన్, రికార్డ్ అసిస్టెంట్, స్కాం రేంజర్స్ పోస్టులను మంజూరు కొరకు సంబంధిత జడ్పిహెచ్ఎస్ కాటాపూర్ హెచ్ఎం ద్వారా(ఫైళ్లను) రికార్డును సిద్ధం చేసి పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని, రాజకీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల సహాయ సహకారాలతో కృషి చేస్తే తొందరగా మంజూరు అవుతాయని పేర్కొన్నారు. ఇట్టికాలీలను గ్రూప్ ఫోర్త్ పోస్టుల ద్వారా నింపడానికి ఆస్కారం ఉందని తెలిపారు. సమయం వృధా చేయకుండా నిరంతరం, జనరల్ నాలెడ్జి సబ్జెక్టు, వివిధ రకాల పుస్తకాలు చదివి, పోటీ పరీక్షల్లో ఎలా తట్టుకోవాలో అందులోని మెలకువలం గురించి వివరించారు. కార్యక్రమంలో యువకులు, గండు బిక్షపతి, రంగు సత్యనారాయణ, గండు హరీష్, సంజీవ, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 03:28PM