నవతెలంగాణ-వీణవంక
దివ్యాంగులను దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వీణవంక ఎస్సై శేఖర్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని స్థానిక శ్రీ సాయి ఆదర్శ సేవా సంఘం మండల అధ్యక్షుడు పైడిమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శేఖర్ హాజరై కేక్ కట్ చేశారు అనంతరం దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మాట్లాడారు. వికలాంగులను సమాజంలో తక్కువగా చేసి హేళన చేసిన ఇబ్బందుల గురిచేసిన చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ వికలాంగుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వికలాంగులకు రాజకీయపరంగా రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా ఆర్థికంగా ఆదుకోవడానికి వికలాంగుల బందు ప్రకటించాలని వారు కోరారు.
వికలాంగుల భవనానికి సహాయ సహకారాలు అందించిన వేణు బుచ్చిరాజం కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంకటాచలం, కోశాధికారి గిరవెన సమ్మయ్య , ఇందిర, శ్రీనివాస్, రాజు, మధునయ్య, అశోక్, కనకయ్య, వెంకటరెడ్డి, తిరుపతి, రాంరెడ్డి, కుమారస్వామి, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 03:36PM