నవతెలంగాణ-డిచ్ పల్లి
అయిల్ ఫాం డ్రిప్ కి ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం రాయితీ, బీసీ ఓసీ లకు 90% రాయితీ ని ప్రభుత్వం ప్రకటించిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పాశం సత్తెవ్వ నర్సింలు, ఎంపిఓ రాజ్ కాంత్ రావు, డిచ్ పల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు, మండల విస్తరణ అధికారులు ప్రకాష్ గౌడ్, శ్రీ హరి లు అన్నారు. శనివారం ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి, డిచ్ పల్లి మండలంలోని యానంపల్లి గ్రామలలో అయిల్ ఫాం సాగు పై రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుకు ఒక ఎకరానికి 50 మొక్కలు పెట్టాలని ఒక్కో ముక్క ఫుల్ కాస్ట్ 1వంద93 రూపాయలు, కాని రాయితీ పోను రైతు ఒక మొక్కకి 20 రూపాయలు కట్టాలని అలా ఒక ఎకరానికి మొత్తం వెయ్యి రూపాయల డీడీతీసి సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారికి ఇవ్వవలని, డ్రిప్ కి ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం రాయితీ, బీసీ, ఓసీ లకి 90% రాయితీ అందజేస్తుందని, రైతులు జీఎస్టీ ని మాత్రం కట్టుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఆయిల్ పాం పంట సాగు వివరాలు, వాటి ప్రాముఖ్యతను, పంట వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చని, రైతులకు అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమం లో హెచ్ఓ సంధ్య, ఉప సర్పంచ్ రాజేందర్, ఎంపీటీసీ మారంపల్లి సుదకర్, డీసీసీబీ డైరెక్టర్ కోరట్ పల్లి ఆనంద్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 04:29PM