నవతెలంగాణ-రాజంపేట్
పీఎం కిసాన్ లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకోవాలని శుక్రవారం మండల వ్యవసాయ అధికారి జోష్ణ ప్రియదర్శిని పేర్కొన్నారు. అనంతరం మాట్లాడుతూ కొద్ది మంది రైతులు మాత్రమే ఈ - కే వై సి చేయించుకున్నారు. ఇంకా 1380 మంది రైతులు ఈ - కేవైసీ చేయించుకోలేదు, కావున సమీపంలో గల సి ఎస్ సి కేంద్రం లేదా మీ సేవ కేంద్రాల ద్వారా ఈ - కే వై సి చేసుకోవాలని ఆమె తెలిపారు.
అలాగే మండలంలోని ఆయ గ్రామ రైతులు ఇంకా ఎవరైనా ఈ కేవైసీ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. లేదంటే తదుపరి డబ్బులు జమ కావు అని అన్నారు . కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, పెట్టుబడి కోసం రైతులకు సహాయంగా పీ. ఎం కిసాన్ పథకం కింద మూడు విడతలుగా రూ.6000 జమ చేస్తున్న దృశ్య పీ. ఎం కిసాన్ పథకం డబ్బిలువచ్చే ప్రతి రైతు చేసుకోవాలని తెలిపారు. ఈ పథకానికి 2019 జనవరి 31లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న పట్టా పాసు పుస్తకాలు వచ్చిన రైతులు మాత్రమే అర్హులు అని అన్నారు, వివరాలకు ఆయా గ్రామ ఏ. ఈ. వో ని సంప్రదించాలి అని కోరారు .
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 04:33PM