నవతెలంగాణ-రాజంపేట్
దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలని మండల విద్యాధికారి రామస్వామి పేర్కొన్నారు. మండలంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని శనివారం మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి దివ్యాంగ విద్యార్థులకు వివిధ రకాల ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నళిని బిసి కాలనీ హెచ్ ఎం గాయత్రి, దివ్యాంగుల ఉపాధ్యాయురాలు మహేశ్వరి, ఫిజియోథెరపీ స్ నవీన్, సాయి మరియు దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు సీఆర్పీలు లింగం, సూర్య పాల్, రమేష్, సాయి రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm