నవతెలంగాణ-కంటేశ్వర్
అనారోగ్యంతో అకాల మరణం పొందిన జర్నలిస్టు నవీన్ నాయక్ మొదటి వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జర్నలిస్టుల కోసం క్రీడా పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే టోర్నమెంట్ లో షటిల్, క్యారం, క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. నగరంలోని ఆఫీసర్స్ క్లబ్ లో షటిల్ పోటీలను ఏసీపీ వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. తోటి జర్నలిస్టు మృతి చెంది ఏడాది గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను స్మరిస్తూ జర్నలిస్టులు క్రీడా పోటీ లు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. జర్నలిస్టుల తో కలిసి షటిల్ ఆడారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శేఖర్, రాజలింగం, కోశాధికారి సందీప్, సీనియర్ జర్నలిస్టులు సాంబయ్య, గంగదాస్,ప్రమోద్, కొట్టురు శ్రీనివాస్,జవీద్,రామకృష్ణ, రజనీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, మధు సూధన్,రాజేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 04:53PM