- పోలీస్ కమీషనర్ కె ఆర్ నాగరాజు
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని పోలీస్ రిక్రూటుమెంటులో ఆర్హత సాధించిన వారికి శారీరధారుఢ్య పరీక్షల కోసం శనివారం పోలీస్ కమీషనరేటు కార్యాలయంలోని, మిని కాన్ఫెరెన్స్ హాలులో పోలీస్ సిబ్బందికి, పోలీస్ కార్యాలయం సిబ్బందికి అవగాహణ కార్యక్రమం ను నిజామాబాద్ పోలీస్ కమీ షనర్ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ కె ఆర్ నాగరాజు మాట్లాడుతూ తేది: 8-12-2022 నుండి నాగారం వద్ద రాజారామ్ స్టేడియంలో పోలీస్ రిక్రూటుమెంటులో పాల్గొనే అభ్యర్థులతో మర్యాదగా మాట్లాడాలని, అభ్యర్థులు మాత్రమే గ్రౌండ్ లోనీకే అనుమతించాలని, విధినిర్వహణలో భాద్యతాయుతంగా నిర్వహించాలని, ప్రతీ ఒక్కరు సి.సి కెమెరాల నిఘాలో ఉంటారని, అభ్యర్థులకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని, రూట్ మ్యాప్ తయారు చేయాలన్నారు. ప్రతీ కౌంటర్ వద్ద అభ్యర్థులను వరుసక్రమంలో కూర్చోబెట్టాలని, ఎవ్వరికి ఎలాంటి సందేహాలు ఉన్నను తమ పై అధికారికి తెలియజేయాలని అన్నారు. ఈ అవగాహణ కార్యక్రమంలో డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు, అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) గిరిరాజు, నిజామాబాద్, ఆర్మూర్, సి.సి.ఎస్, సి.టి.సి ఎ.సి.పిలు ఎ. వెంక టేశ్వర్, ఆర్. ప్రభాకర్ రావు, రమేష్, శ్రావణ్ కుమార్, ఎ.ఓ రామారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సూపరింటెండెంటులు, సి.ఐలు, ఎస్.ఐలు, పోలీస్ కార్యాలయం సిబ్బంది, ఐ.టి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 04:58PM