నవతెలంగాణ-రాజంపేట్
జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కామారెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో వ్యాయామ ఉపాధ్యాయుడు బాణాల భాస్కర్ రెడ్డి షాట్ పుట్ విభాగంలో గోల్డ్ మెడల్, డిస్కస్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్, జావలిన్ త్రో విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించి మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. జిల్లా పరిషత్ హై స్కూల్ ఆర్గోశీడ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బాణాల భాస్కర్ రెడ్డి నీ జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రాజన్న , అధ్యక్షులు రంజిత్ మోహన్, జనరల్ సెక్రెటరీ నరేష్, మాజీ ఎస్ జి ఎఫ్ సెక్రటరీ వెంకటి, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కెపి అనిల్ కుమార్, మరియు ఖో ఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆతిక్ మరియు జిమ్నాస్టిక్స్ కార్యదర్శి నరేష్ రెడ్డి పాల్గొనడం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 03 Dec,2022 05:00PM