నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో గల హరిహరపుత్ర అయ్యప్ప ఆలయానికి శనివారం భక్తులు విరాళాలు అందజేశారు. మండల కేంద్రానికి చెందిన పెద్ద బచ్చ శ్రీనివాస్ రెడ్డి పద్మా దంపతుల కూతురు మాధురి రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం తన వంతుగా రూ.5100 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆమెను అభినందించి, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు లింబాద్రి గురుస్వామి, వెంకటసుబ్బారావు, అయ్యప్ప స్వాములు శ్రీనివాసరెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm