నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో గల అంగన్ వాడి సెంటర్ కు పలువురు దాతలు శనివారం బీరువాను వితరణ చేశారు. పట్టణంలో గల 48/5 అంగన్ వాడి సెంటర్ పరిధిలోగల పలువురు దాతలు ముందుకు వచ్చి రికార్డులను భద్రపరిచేందుకు వీలుగా ఉండాలన్న ఉద్దేశంతో దాతలు మమతా సునీల్, భార్గవి గణేష్ ,రమ్మని హరీష్, రవళి నవీన్, స్వామి రజితలు సెంటర్ కు బీరువాను కొనుగోలు చేసి అందజేశారు. ఈ సందర్భంగా వారిని అంగన్వాడీ సెంటర్ నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శోభ, టీచర్లు విజయలక్ష్మి ,యాదమ్మ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm